రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’. బొమ్మ బొరుసా పతాకంపై ఐ. భరత్ నిర్మించిన ఈ చిత్రానికి విస్కి దర్శకత్వం వహించాడు. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా జూలై 19న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కామన్ ఆడియన్స్ ఈ సినిమాలోని కంటెంట్‍కు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో మంచి మౌత్ టాక్‌తో, క్రిటిక్స్ అభినందనలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఇటీవలే థ్యాంక్స్ మీట్ కూడా జరుపుకుంది.
ఇక ఇదిలావుంటే, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ది బర్త్‌డే బాయ్ చిత్ర బృందాన్ని అభినందించారు. తాజాగా మూవీ యూనిట్ ఆయనను కలిసింది. ఈ సందర్భంగా దిల్ రాజు సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























