లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. షూటింగ్ పరంగా ఈసినిమా చాలా టైమ్ ను తీసుకుంది. మేకర్స్ తో సమస్యలు, ఆతరువాత శంకర్ వేరే సినిమాతో బిజీగా ఉండటం పలు కారణాలవల్ల సినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. అయినా కూడా ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం పెద్ద మొత్తానికే సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయిన 6-8 వారాల తరువాత రిలీజ్ చేయాలన్న ఒప్పందం తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఆగష్ట్ సెకండ్ వీక్ లోనే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారటరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే. మరి కొన్ని సినిమాలు థియేటర్లలో నిరాశ పరిచినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఈసినిమా కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందేమో అన్న నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరి ఓటీటీలో భారతీయుడు2 ఎలాంటి ఆదరణను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























