గేమ్ ఛేంజర్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు

Producer Dil Raju Announced Game Changer Release Date

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి చరణ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించారు. గేమ్ ఛేంజర్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రాయన్’ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆయన గేమ్ ఛేంజర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా ఈ పొలిటికల్ డ్రామా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.