ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. దానికితోడు ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ 5 వ తేదీ నుండి హైద్రాబాద్ లో ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా లాంగ్ షెడ్యూల్ ను ఆగష్ట్ 5వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























