మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది సలార్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు ప్రాంతాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తన మ్యానియా చూపించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకోవడంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ను సైతం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా మరో కొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది. బుక్ మై షోలో ఈసినిమా 12.15 మిలియన్ టికెట్స్ బుక్ చేసుకుని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇప్పటి వరకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన చిత్రం జవాన్ ఖాతాలో ఉంది. జవాన్ మూవీ ఇండియా వైడ్ గా 12.01 మిలియన్ టికెట్స్ హైయెస్ట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. దీనిని కల్కి కేవలం 20 రోజుల్లోనే బ్రేక్ చేసి సెన్సేషనల్ రికార్డు సెట్ చేసింది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























