ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో ఇప్పటికే ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ చెప్పేసిన సంగతి తెలిసిందే కదా. జులై 23వ తేదీన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. సూర్య పుట్టిన రోజు సందర్భంగా జులై 23వ తేదీ ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేళ్ రాజా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























