పండుగలకు సినిమాలు రిలీజ్ అవ్వడం కామనే. అందుకే ఏదైనా పండుగ వస్తుందంటే సినిమాలు ముందుగానే డేట్లను రిజర్వ్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే డిసెంబర్ కు పుష్ప, తండేల్ తో పాటు పలు సినిమాలు క్యూ కట్టగా ఇప్పుడు మరో సినిమా లిస్ట్ లో చేరింది. ఆసినిమా మరేదో కాదు మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా ఎప్పుడు రిలీజ్ ఎప్పుడా అన్న క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. ఈ ఏడాది చివరిలో ఈసినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు అయితే ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు. ముందు నుండీ అనుకున్నట్టే ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు మంచు విష్ణు తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు.
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























