తంగలాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

manakki manakki first single update from thangalaan movie

వైవిథ్యమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఆ విషయాన్ని ఇప్పటికే తన సినిమాల ద్వారా నిరూపించాడు కూడా. అందుకే విక్రమ్ సినిమా అంటే తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా కోసం. ఈసినిమా కోసం ఎంత ఈగర్ వెయిట్ చేశారో అంత ఆలస్యం అయింది. ఎట్టకేలకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ రీసెంట్ గానే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈమధ్య ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. మనక్కి మనక్కి అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను రేపు అంటే జులై 17వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

కాగా పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.