నివేదా థామస్ 35 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Nivetha Thomas' 35 Chinna Katha Kaadu Movie Update

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్‌ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ’35 – చిన్న కథ కాదు’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 35 సెకన్ల నిడివితో ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ పాత్రను పరిచయం చేయనున్నారు. కొంచెం అమాయకత్వం, ప్రేమ మరియు ఆప్యాయత గుణాలు కలిగిన గృహిణిగా నివేదా థామస్ కనిపించినుంది.

ఇక ’35 – చిన్న కథ కాదు’ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రియదర్శి, విశ్వదేవ్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. కాగా 35 మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.