నా పెళ్లి అప్పుడే-కిరణ్ అబ్బవరం

kiran abbavaram gives clarity on his marriage

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. నటి రహస్య గోరక్ తో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో జరిగింది. రాజావారు రాణిగారు సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఈసినిమాతోనే కిరణ్‌, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి కూడా. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నారు.ఈనేపథ్యంలోనే తన పెళ్లి ఎప్పుడో చెప్పేశాడు కిరణ్ అబ్బవరం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ అబ్బవరం హీరోగా రాబోతున్న సినిమా క. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‍ లో పాల్గొన్న కిరణ్ ను పెళ్లి ఎప్పుడు అని అడుగగా వచ్చే నెల అంటే ఆగష్ట్ లో అంటూ క్లారిటీ ఇచ్చాడు.

కాగా శ్రీ చక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణతో కలిపి కిరణ్ అబ్బవరం కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమాతో అయినా కిరణ్ కు మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.