కిచ్చా సుదీప్ మ్యాక్స్ తెలుగు టీజర్ రిలీజ్

Kichcha Sudeep's MAX Telugu Teaser Released

‘ఈగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మ్యాక్స్’. హై-ఆక్టేన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నాడు. వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, అనిరుధ్ భట్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా మహాబలిపురంలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మ్యాక్స్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్. మంగళవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. కన్నడ సహా తెలుగు అఫీషియల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనిని గమనిస్తే, మూవీ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందినట్టు తెలుస్తోంది. తెలుగు నటుడు సునీల్ ఇందులో కీలక పాత్రలో కనిపించాడు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వి క్రియేషన్స్‌తో పాటు సుదీప్ హోం బ్యానర్ కిచ్చా క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.