అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

Superstar Mahesh Babu Family Attends Anant Ambani Wedding Ceremony

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‍ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో అనంత్ ఇరు కుటుంబాల సాక్షిగా రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి మహేష్ కళ్యాణ వేదిక వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన మహేష్ బాబు స్టైలిష్ లుక్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా త్వరలో ఓ పాన్ వరల్డ్ మూవీ స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు అమితాసక్తి కనబరిచారు.

కాగా జూలై 12-14 తేదీలలో మూడు రోజులపాటు వీరి కళ్యాణ వేడుకలు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నిన్న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’ జరుగగా.. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం ‘మంగళ్ ఉత్సవ్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటీ,నటులతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.