అశ్విన్ బాబు శివం భజే రిలీజ్ డేట్ ఫిక్స్

ashwin babu shivam bhaje movie release date fixed

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ అప్పుడప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తరువాత మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.