కల్కి నుండి మృణాల్ లుక్ రిలీజ్

mrunal thakur look out from kalki 2898 ad movie

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అంతేకాదు ఇప్పటికే అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ను చేరుకోవడంతో నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్రయూనిట్ మృణాల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మృణాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో మృణాల్ దివ్య అనే పాత్రలో నటిస్తుంది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.