తెలుగు ఆడియన్స్ పై కంగువ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

k e gnanavel raja interesting comments on telugu audience

తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి ప్రేక్షకులయందు తెలుగు ప్రేక్షకుల వేరయా అన్నట్టు ఉంటారు మనవాళ్లు. మన హీరోనా వేరే ఇండస్ట్రీ హీరోనా అని చూడరు. తమకు నచ్చితే చాలు నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మన ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో నిర్మాత కూడా తెలుగు ఆడియన్స్ పై పొగడ్తలు కురిపించాడు. ఆ నిర్మాత ఎవరో కాదు కంగువ నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ రాజా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కే.ఈ జ్ఞానవేల్ రాజా తెలుగు ఆడియన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్ఞానవేల్.. తెలుగు హీరోలను తమిళ్ ప్రేక్షకులు కానీ, మీడియా వారు కానీ హీరోలుగానే చూస్తారు.. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం వేరు.. త‌మిళ హీరోలను కూడా వాళ్ల హీరోలుగానే చూస్తారు. అందుకే ర‌జినీ కాంత్, క‌మ‌ల్ హాస‌న్, సూర్య‌, కార్తీ, విక్ర‌మ్, విజ‌య్ ద‌ళ‌ప‌తి, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌ర హీరోలంద‌ర‌ని తెలుగులో మ‌న హీరోలు అని ఓన్ చేసుకున్నారు. వారిలో అది చాలా న‌చ్చుతుంది. అందుకే తెలుగు ప్రేక్ష‌కుల‌కు మిగ‌త ప్రేక్ష‌కులకు చాలా తేడా క‌నిపిస్తుందని చెప్పుకోచ్చాడు.

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.