శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భైరవన కోనే పాఠ’. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా శివ రాజ్‌కుమార్ ‘ఘోస్ట్’ చిత్రం తర్వాత హేమంత్ రావు డైరెక్షన్ లో ఓ చిత్రం చేయనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా కన్నడనాట వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కొత్త సినిమాకు ‘భైరవన కోనే పాఠ’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్టు అర్ధమవుతోంది. ఇందులో శివ రాజ్‌కుమార్ యోధుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని వైశాక్ జే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వైశాక్ జే గౌడ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల మరియు పనిచేయనున్న టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
ఇక హేమంత్ రావు సినిమాల విషయానికి వస్తే.. ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో సిద్ధహస్తుడు. ఇంతకుముందు కన్నడలో అనేక సూపర్ హిట్ సినిమాలు తీసిన చరిత్ర ఉంది. ఆయన దర్శకత్వం వహించినవాటిలో వీటిలో ‘గోధి బన్న సాధారణ మైకట్టు’, ‘కవలుదారి’, ‘భీమ సేన నల మహారాజు’, ‘సప్త సాగరాలు దాటి సైడ్-ఏ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కాగా కవలుదారి చిత్రం తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ అయింది. ఈ నేపథ్యంలో శివ రాజ్‌కుమార్ హీరోగా హిస్టారికల్ నేపథ్యమున్న సినిమాను రూపొందిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























