వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. మరోసారి నాని ఈసినిమాతో తనలో ఉన్న మాస్ ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అలానే ప్రమోషన్స్ పై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. రీసెంట్ గానే హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రియాంక మోహన్ డబ్బింగ్ కూడా మొదలుపెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కౌంట్ డౌన్ మొదలైపోయిందని.. ఈసినిమా రిలీజ్ కు 50 రోజులు ఉందని తెలిపారు. ఈసందర్భంగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. స్పెషల్ మేకింగ్ షాట్స్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ఇది. అలానే గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































