భారతీయుడు 2 టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

CM Revanth Reddy Congratulates Bharateeyudu 2 Movie Team

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భారతీయుడు 2’. తాజాగా ఈ చిత్ర బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 1996లో వీరి కాంబో లోనే వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్​గా రూపొందిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.

ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం డ్రగ్స్, సైబర్ క్రైమ్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా ఇటీవలే ఈ అంశంపై ఆయన సినిమా పరిశ్రమకు ఒక సూచన చేసిన సంగతి తెలిసిందే. సినిమాల విడుదలకు ముందు టికెట్ల ధరలను పెంచాలని ప్రభుత్వం వద్దకు వచ్చేవారు, తప్పని సరిగా డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ వీడియోలను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి షరతు విధించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. “డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్థ, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహన వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం” అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా భారతీయుడు 2 చిత్రానికి అనిరుధ్ ర‌విచందర్ సంగీతాన్ని సమకూర్చగా, ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. అలాగే ఎడిట‌ర్‌గా ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ బాధ్యతలు నిర్వహించారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌ కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.