టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా రెండు సినిమాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మరియు భాను బోగవరపు డైరెక్షన్ లో #RT75 చేస్తున్నాడు. కాగా వీటిలో మిస్టర్ బచ్చన్ ముందుగా థియేటర్లలోకి రానుంది. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ మేరకు రిలీజ్ డేట్‍ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇదిలావుంటే, మిస్టర్ బచ్చన్ నుంచి మేకర్స్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు. ‘సితార’ అనే ఫస్ట్ సింగిల్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాంగ్‌ను బుధవారం ఉదయం 11:07 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
అందులో.. “కెవ్వుకేక మరియు అస్మైక యోగా అనే రెండు చార్ట్‌బస్టర్‌ల తర్వాత, హరీష్ మరియు గీత రచయిత సాహితీ కాంబో మిస్టర్ బచ్చన్‌లోని సితార్ పాట కోసం మళ్లీ కలిసింది. మిక్కీ జె మేయర్ యొక్క అద్భుతమైన బీట్‌లతో మంత్రముగ్దులను చేసే సాహిత్యం కోసం సిద్ధంగా ఉండండి. రేపు ఉదయం 11.07 గంటలకు పూర్తి పాట విడుదలవుతుంది” అని పేర్కొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది.
మరోవైపు రవితేజ తన మైల్‌స్టోన్ సినిమా #RT75ను కూడా ఇటీవలే పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. కాగా ఇది రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. ఇందులో శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























