ఈమధ్య ఒక సినిమా థియేటర్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు సైతం చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం రిలీజ్ అయి ఏడాది అవుతున్నా కానీ ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. ఆసినిమా మరేదో కాదు అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా. అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా 2023 ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా ఇప్పటికే ఎన్నో అప్ డేట్లు వచ్చాయి. అప్పట్లో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అప్పుట్లో ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్నారు. అంతేకాదు గత ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్నట్టు కూడా తెలిపారు. కానీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ సోనీ లివ్ వారు తమ ట్విట్టర్ లో ఏజెంట్ సినిమాకు సంబంధించిన పోస్ట్ లు అన్నీ తొలగించారు. దీంతో సోని లివ్ లో ఈసినిమా రాదని అర్థమవుతుంది. మరి ఈసినిమా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో చూడాలి.
కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నంటించాడు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించంగా.. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చాడు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా… ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























