మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ ఛాయగ్రాహకుడు నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా 1980-90 లలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ కథాంశంగా రూపొందుతోంది. దీంతో నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో నిర్మించినట్టు తెలుస్తోంది. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే ఒక భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. వినాయక చవితి సందర్భంగా.. లక్కీ భాస్కర్ చిత్రాన్ని తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్.
కాగా ముందుగా నిర్ణయించిన మేరకు ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. దీంతో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ చేయడం రిస్క్ తో కూడుకున్నందున లక్కీ భాస్కర్ నిర్మాతలు తాజాగా సినిమా విడుదల తేదీని మార్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























