ఓటీటీ లోకి హరోం హర.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Harom Hara OTT Platform and Streaming Date Announced

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించగా.. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించారు. సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న‌ విడుద‌లయింది. అయితే థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్ట్ టాక్ రావడంతో ఓ మాదిరి ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో హరోం హర చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ మంచి ధరకు ఈ మూవీ హక్కులు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆహా తాజాగా హరోంహర స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.

జూలై 11న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో దీనిపై అధికారిక ప్రకటన చేసింది. అందులో.. “బలవంతుడికి ఆయుధం అవసరం.. కాని బాలహీనుడికి ఆయుధమే బలం! హరోం హర ప్రీమియర్స్ జూలై 11న ఆహాలో మాత్రమే” అని పేర్కొంది. సో మూవీ లవర్స్.. గెట్ రెడీ. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.