ఈగల్ తరువాత మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ తో పలకరించనున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా.ఇంతకుముందు షాక్ ,మిరపకాయ్ వచ్చాయి.ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో మిస్టర్ బచ్చన్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈనెలలో కంప్లీట్ కానుంది.ఆగస్టు 15న విడుదలచేయాలనే ప్లాన్ లో వున్నారు.రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలోని ఫస్ట్ సింగిల్ సితార ఈరోజు రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాపడింది.ఈ బుధవారం రానుంది.ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదిలారు.బుధవారం ఉదయం 11:07 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.మిస్టర్ బచ్చన్ లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
మరోవైపు రవితేజ తన నెక్స్ట్ సినిమాను కూడా మొదలెట్టాడు.ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది.ఇది రవితేజ కు 75వ సినిమా.ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























