టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు నార్త్ ఇండియాలోనూ కల్కి మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో అత్యధిక నెట్ అందుకున్న రెండో సినిమాగా రికార్డ్ సృష్టించిన కల్కి.. బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తుండటం విశేషం. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇలాంటి మూవీ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పైన రాలేదని, విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయని వారు కితాబిస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా తాజాగా మరో మైలు రాయిని అందుకుంది. ఫస్ట్ వీకెండ్లో అదరగొట్టిన కల్కి చిత్రం సెకండ్ వీకెండ్లోనూ సత్తా చాటింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొత్తం 11 రోజుల్లో రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
కాగా కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























