శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ధనుష్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు శేఖర్ కమ్ముల. నాగార్జున ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. కూల్ లుక్ లో ఉన్న నాగార్జున ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లిన రష్మిక అక్కడ గుంతను తవ్వి అందులో నుండి పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీస్తుంది. ఆ ట్రాలీ బ్యాగ్ నిండా డబ్బు ఉండగా.. ఆ డబ్బును తీసుకొని వెళుతుంది.
కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























