సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు

Kalki 2898 AD Producer Ashwini Dutt Interesting Comments on Tickets Price Hike

కొత్త సినిమాల విడుదల సందర్భంగా ఆయా చిత్రాల నిర్మాతలు తొలివారం టికెట్ రేట్ల పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తుండటం సర్వసాధారణం. అయితే వీటికి ప్రత్యేకమైన విధివిధానాలు అంటూ ఏమీ లేవు. తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఒక సూచన చేసినట్లుగా.. కల్కి చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ చెప్పారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి చెప్పిన మాటలపై అనవసరపు అపోహలకు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ రేట్ల పెంపుదల కోసం ప్రతీసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిలాష అని ఆయన తెలిపారు.

అలాగే, పరిశ్రమలోని నిర్మాతలంతా కలిసి కూర్చుని కూలంకుషంగా చర్చించుకోవాలని, సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవచ్చు అనే దానిపై ఒక నిర్ణయానికి రావాలని పవన్ కళ్యాణ్ సూచించారని అన్నారు. అప్పుడు తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారని వివరించారు నిర్మాత అశ్వనీదత్.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.