‘మక్కళ్ సెల్వన్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. కాగా ఇది విజయ్ సేతుపతి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ 14న మహారాజ తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలో మహారాజ రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.100.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కాగా ఇది విజయ్ సేతుపతికి సోలో హీరోగా తొలి 100 కోట్ల మూవీ కావడం గమనార్హం.
‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటి మమతా మోహన్ దాస్, అభిరామి, దివ్య భారతి, మునీష్ కాంత్ కీలక పాత్రల్లో నటించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జగదీష్ పళని స్వామి, సుదన్ సుందరమ్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























