కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కల్కి నుండి శంబలా వీడియో సాంగ్ రిలీజ్

Hope of Shambala Video Song Out From Kalki 2898 AD
సాంగ్1 ని. చదువు

కల్కి నుండి శంబలా వీడియో సాంగ్ రిలీజ్

Hope Of Shambala Video Song Out From Kalki 2898 AD

Hope of Shambala Video Song Out From Kalki 2898 AD

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ విజువల్ వండర్‌ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 స్క్రీన్‌లలో ప్రదర్శించబడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా కల్కి నుండి శంబలా వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. తెలుగు సహా అన్ని ప్రధాన భాషల్లో ఈ పాట యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంచింది. కాగా ఈ సినిమాలో శంబలా ప్రాంతానికి ఓ ప్రాముఖ్యత ఉంది. కల్కి ఆగమనం కోసం ఆ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తుంటారన్నట్లు చిత్రంలో చూపించారు.

ఇక కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్