జానీ మాస్టర్ కు మెగా బహుమతి

ram charan celebrates dance master jani birthday

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన జానీ మాస్టర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిరంజీవి సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఇక్కడ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. ఎంతోమంది హీరోలకు కొరియోగ్రఫి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు జానీ మాస్టర్ పుట్టినరోజు. ఈనేపథ్యంలో ఆయన పుట్టినరోజును మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జానీ మాస్టర్ ని ఇంటికి పిలిచి మరీ స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పి బహుమతిని అందించారు. అంతేకాదు తన పుట్టినరోజుకు మెగా ఫ్యామిలీ ఒక ప్రామిస్ చేసినట్టు కూడా తెలిపారు. జానీ మాస్టర్ తన ట్విట్టర్ ద్వారా సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500కు పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.