శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బాగానే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రెండు ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ముందు ఆహా వారు ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా.. ఆహాలో ముందు స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆతరువాత ప్రముఖ ఓటీట సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం అమెజాన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటివరకూ తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది ఈసినిమా. ఇప్పుడు తాజాాగా మరో అప్ డేట్ వచ్చింది. నేటి నుండి ఈసినిమా తమిళ్, కన్నడ మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ ను త్వరలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో మలయాళ నటుడు రాహుల్ మాధవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























