సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుండో కన్ఫ్యూజన్ ఉన్న రిలీజ్ డేట్ పై రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో కింగ్ రాబోతున్నాడు.. సినిమా విడుదలకు ఇంకా 100 రోజులే ఉందని.. కంగువ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేళ్ రాజా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























