అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు చివరి దశకు వచ్చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 19వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఖలసే అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాహీ రే అంటూ వచ్చే సోల్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈపాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
కాగా ఇంకా ఈ సినిమాలో బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























