ప్రభాస్ హిందీలో మరోసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు.బాహుబలి నుండి ప్రభాస్ కు నార్త్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.ఈసినిమా తరువాత ఒక్క రాధేశ్యామ్ తప్ప రిలీజ్ అయిన అన్ని సినిమాలు అక్కడ 100కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి.ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి నిన్నటితో 100కోట్ల క్లబ్ లో చేరింది.నాలుగు రోజుల్లో ఈసినిమా 115 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.నిన్న ఒక్క రోజే హిందీ వెర్షన్ 42 కోట్ల నెట్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు హిందీలో ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయనుంది.ప్రస్తుతానికి హృతిక్ రోషన్ ఫైటర్ 215 కోట్ల నెట్ తో మొదటి స్థానం లో వుంది.ఈవీక్ లో కల్కి ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సౌత్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. నిన్న ఒక్క రోజే 25కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో నాలుగో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.రెండు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజుల్లో 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక తమిళనాడు లో అయితే 15కోట్ల గ్రాస్ ను కేరళలో 13కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.వచ్చే వారం లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఈసినిమాతో ప్రభాస్ వరుసగా రెండో హిట్ కొట్టనున్నాడు.గత ఏడాది సలార్ తో హిట్ కొట్టగా ఇప్పుడు కల్కి తో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకోనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























