సుధీర్ బాబు కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే హరోం హర సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఓ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్లో నటించబోతున్నాడట. ఇది సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈసినిమాలో సుధీర్ బాబు కొత్తగా కనిపించబోతోన్నాడని తెలుస్తోంది. రుస్తుం, టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి డిఫరంట్ కాన్సెప్ట్, బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఆగష్ట్ 15న ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే వచ్చే ఏడాది శివరాత్రి స్పెషల్గా మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఈసినిమాలో నటించబోతుందట. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























