బచ్చలమల్లి-నరేష్ ఊరమాస్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

Allari Naresh Birthday Glimpse out from Bachhala Malli movie

కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లరి నరేష్ నాంది సినిమాతో తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే నాంది తరువాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఊర మాస్ గా ఉన్న గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. తన నిద్రను చెడగొట్టే మైక్ ను నేలకేసి కొడతాడు నరేష్. ఆతరువాత స్టైల్ గా మందు పోసుకొని తాగుతూ రౌడీలను కొడుతుంటాడు. గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.