విజయ్ ఆంటోని తుఫాన్ ట్రైలర్ రిలీజ్

vijay antony toofan movie trailer out now

మొదటినుండీ కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేయడానికే విజయ్ ఆంటోని ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాటతో మొదలైన ఈ ట్రైలర్ లో శరత్ కుమార్, విజయ్ ఆంటోనీ కలిసి ఒక బోట్ నుండి దిగుతారు. విజయ్ ఆంటోనీ దాచుకున్న బ్లేడ్‌ను శరత్ కుమార్ పడేస్తారు. ఈ ఊరిలో ఎవరికీ నువ్వు తెలీదు. నువ్వు ఎవరికీ తెలియకూడదు అని అంటాడు. అక్కడ శరణ్య కుటుంబం అతనిని ఆదరిస్తుంది. మరోవైపు ఓ పోలీస్‌ అధికారి అతని కోసం గాలిస్తుంటాడు. తనను ఆదరించిన ఫ్యామిలీ కోసం హీరో ఏం చేశాడు? పోలీసులు అతన్ని వెంటాడటానికి కారణాలేమిటి? అనేది ఈసినిమా కథగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది.

కాగా ఈసినిమాలో ఇంకా మేఘా ఆకాష్‌, మురళీశర్మ, పృథ్వీ అంబర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని అందిస్తుండగా.. రచన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం విజయ్‌ మిల్టన్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.