మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో రూపొందిన ‘స్కంద’ సినిమా యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. గతేడాది అక్టోబర్ 6న తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకుంది. అనంతరం స్కంద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమా నెట్టింట హిందీ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గత కొన్నేళ్లుగా రామ్ పోతినేని చిత్రాలకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. అందులోనూ హిందీ వెర్షన్‌లో వీటిని వీక్షించే ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి యూట్యూబ్‌లో 54 మిలియన్ల వ్యూస్ రాగా.. 7,46,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల లీడ్ రోల్ చేయగా.. ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్ మరో ప్రధాన పాత్రలో కనిపించింది. సీనియర్ నటులు దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా స్కంద చిత్రానికి సీక్వెల్ కూడా రానున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























