నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈసినిమా సాలిడ్ ఫలితాన్ని అందించింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట టక్కర్ అనే వీడియో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్ వరల్డ్ లో వచ్చిన ఈపాట ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ డే 191 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని ఇండియన్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాల జాబితాలో 3వ సినిమాగా స్థానాన్ని దక్కించుకుంది. ముందు ముందు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
కాగా ఈసినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























