ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అహం రీబూట్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై అంచనాలను బాగానే పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ పై ఇప్పుడు ఒక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఈసినిమాను ముందు నుండీ థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొంతం చేసుకోగా.. ఆహాలో ఈసినిమా డైరెక్ట్ గా రిలీజ్ అవ్వబోతుందని సమాచారం. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జూన్ 30వ తేదీన డైరెక్ట్ గా ఆహాలోకి రాబోతుందట.
కాగా ఈసినిమాను వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు సమర్పిస్తున్నారు. ఈ మూవీ కి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమా సుమంత్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























