బచ్చలమల్లి-నరేష్ బర్త్ డే గ్లింప్స్ టైమ్ ఫిక్స్

allari naresh birthday glimpse update from bachhala malli movie

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఈమధ్య కాస్త రూట్ ను మార్చి డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఇప్పటికే నరేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ గా మల్లి అనే పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చేశారు. రేపు అంటే జూన్ 30వ తేదీన నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఉదయం 9 గంటలకు స్పెషల్ బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.