రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు కూడా వచ్చేసింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
కాగా ఈసినిమాలో ఇంకా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























