రివ్యూ: కల్కి 2898 AD

Kalki 2898 AD Review in Telugu

నటీనటులు : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు 
సంగీతం : సంతోష్ నారాయణన్ 
దర్శకత్వం : నాగ్ అశ్విన్ 
నిర్మాతలు: అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్కి డే రానే వచ్చింది.తెలుగులోనే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది ఈసినిమా కోసం. ప్రభాస్ ఇందులో నటించడం,హాలీవుడ్ లెవెల్లో విజువల్స్ వీటికి తోడు బాలీవుడ్ స్టార్లు అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటాని అలాగే సౌత్ స్టార్ కమల్ హాసన్ ఇలా భారీ తారాగణం ఉండడంతో సినిమాకు హైప్ ఓ రేంజ్ లో వచ్చింది.ఎంతంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు దాటేసింది.మరి ఇంత భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఎలా ఉంది ఆ అంచనాలను అందుకుందా లేదో తెలుసుకుందాం. 

కథ :

కాశీ, కాంప్లెక్స్, శంబల ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథ ఇది. వీటన్నింటికీ మహాభారతంతో లింక్ ఉంటుంది.భూమి మీద చివరి నగరంగా చెప్పుకొనే కాశీ లో దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.మరోవైపు భూమి మీద వనరులను ఉపయోగించుకొని స్వర్గం లాంటి కాంప్లెక్స్ ను నిర్మిస్తాడు యాస్కిన్ (కమల్ హాసన్).దాంతో కాశీ ఫైటర్ అయిన భైరవ ఎలాగైనా కాంప్లెక్స్ కు వెళ్లి స్థిరపడిపోవాలనుకునే ప్రయత్నంలో ఉంటాడు.ఇక అన్ని మతాల శరణార్థులు వుండే ప్రాంతంగా శంబల ఉంటుంది.ఈ క్రమంలో సుమతి (దీపికా పదుకొణె) కడుపులో వున్న కల్కి(దేవుడు)ని కాపాడడానికి అశ్వత్ధామ వస్తాడు.ఇంతకీ భైరవ అనుకున్నది సాధించాడా? యాస్కిన్ లక్ష్యం ఏంటి? అశ్వత్ధామ,భైరవ కు సంబంధం ఏంటి అనేదే మిగితా కథ. 

విశ్లేషణ :

తను రాసుకున్న కథను  అద్భుతంగా ప్రెసెంట్ చేసి తెరమీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.మహాభారతంకు సైన్స్ ను జోడించి సెపరేట్ వరల్డ్ ను సృష్టించాడు.సినిమా ప్రారంభంలోనే తన ప్రపంచం లోకి తీసుకెళ్లాడు.అయితే పాత్రల పరిచయానికి కొంచెం ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు.ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.అసలైన కథ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది.దాంతో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెరుగుతుంది.ఇక సెకండ్ హాఫ్ ఎక్స్ పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 

ముఖ్యంగా చివరి 30 నిమిషాలను డైరెక్టర్ అద్బుతంగా డీల్ చేశాడు.భైరవ, అశ్వత్ధామ పాత్రలు సినిమాకు హెలైట్ అయ్యాయి.సినిమా అంతా ఒక విజువల్ వండర్ లా అనిపిస్తుంది. ప్రభాస్ సినిమాలో ఇంకాసేపు ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ కు అనిపించొచ్చు.సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా ఇందులో కామెడీ  కూడా మిస్ కాలేదు.వీటికి తోడు సప్రైజ్ క్యామియోస్ కూడా వున్నాయి.రెండో భాగం కోసం లీడ్ కూడా ఇచ్చాడు డైరెక్టర్.ఓవరాల్ గా కల్కి థియేటర్లలో చూసే సినిమా.

నటీనటుల విషయానికి వస్తే భైరవ రోల్ లో ప్రభాస్ అదరగొట్టాడు.చాలా ఈజ్ తో ఆ పాత్ర ను నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లాడు.ఇక అశ్వత్ధామ రోల్ లో కనిపించిన  అమితాబ్ ఏజ్ తో సంబధం లేకుండా సూపర్ గా చేశాడు.తన పాత్ర సినిమా అంత ఉంటుంది.యాస్కిన్ గా కమల్ లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చాడు.తన గెటప్ అయితే గుర్తుపట్టలేనట్లుగా వుంది.దీపికా పదుకొణె కు మంచి పాత్ర దొరికింది.ఆ పాత్రలో తను చాలా బాగా చేసింది. ఇక దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి  తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్లో వుంది.ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి.హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఎడిటింగ్ కూడా ఓకే.లెంగ్త్ ఎక్కువైనా ఎక్కడా బోర్ కొట్టదు.సంగీతం ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్లు గా ఉండి చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అదిరిపోయాయి.అశ్వినీ దత్,ప్రియాంక దత్, స్వప్న దత్ సినిమాను చాలా క్వాలిటీ గా నిర్మించారు.పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తుంది. 

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్  సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.