దీనిని ఒక్కసారి చూస్తే సరిపోదు, ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నా

Kalki 2898 AD is Couldn’t Get Enough in One Viewing, Says Director Sailesh Kolanu

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మైథాలజీ-ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది. వీటితోపాటుగా ఇటీవలే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక విడుదలకు ముందే అనేక రికార్డులు క్రియేట్ చేసిన కల్కి ఇదేక్రమంలో బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో సైతం సత్తా చూపిస్తోంది. ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శైలేష్ కొలను కల్కి సినిమాపై తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో.. “ఏదయినా సినిమా చూసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక కూడా మీతోపాటు ట్రావెల్ చేస్తుందంటే.. అది ఖచ్చితంగా గొప్ప చిత్రమే. కల్కి 2898 AD కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం. నాగ్ అశ్విన్ మరియు ఆయన టీమ్ తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. ప్రభాస్ అన్నని ఆ పాత్రలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమాను ఒకసారి చూస్తే సరిపోదు, అందుకే ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నాను” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.