శామ్ ఆంటోన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా బడ్డీ. ఊర్వశివో..రాక్షసివో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాపై క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్. మొదటి నుండీ ఈసినిమా ఆర్యన్ టెడ్డీ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుండీ రీమేక్ సినిమా ఎందుకు చేస్తున్నారని అడిగారు.. కానీ ఈసినిమా ఏసినిమాకు రీమేక్ కాదు.. ఇది విభిన్నమైన కథ.. భిన్నమైన ప్రయత్నం.. ప్రజలు ఈసినిమాను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని నేను కొంచెం భయపడ్డాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత, కొంచెం రిలీఫ్ అయ్యాను. ప్రేక్షకులు ఎల్లప్పుడూ మంచిని ప్రోత్సహిస్తారు. పెద్ద స్టార్‌లు లేకపోయినా కంటెంట్ ఫిలింలు అందరినీ అలరిస్తాయని నేను ఆశిస్తున్నాను అంటూ స్పష్టం చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























