పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నెల 27న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మైథాలజీ-ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది.
వీటితోపాటుగా ఇటీవలే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు కేవలం రెండు రోజులే ఉండడంతో ప్రేక్షకులు, సినీవర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ విజువల్ వండర్‌లో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్ర గురించి చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో “ది వన్ అండ్ ఓన్లీ సుప్రీం ‘యాస్కిన్’.. కమల్ హాసన్” అని పేర్కొంది.
ఇక దీనిని బట్టి కల్కిలో కమల్ హాసన్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లో కమల్ ఎండింగ్ సీన్లో కనిపించి భయపెట్టిన విషయం తెలిసిందే. ఈ సన్నివేశంలో ఆయనను ఎవరూ గుర్తుపట్టలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఆయన మేకోవర్, డైలాగ్ మాడ్యులేషన్ ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. కాగా కమల్ హాసన్ కూడా ఇటీవల మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో ఈ పాత్రను చేయగలనా? లేదా? అని తొలుత భయపడ్డానని తెలిపారు. దీంతో ఆయన పాత్ర సినిమాలో అన్బిలివబుల్గా ఉండబోతుందని అర్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























