కల్కి రీజన్స్ టు వాచ్

reasons to watch of prabhas kalki 2898 ad movie

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్
ఈసినిమాకు ప్రధాన బలం ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ను చూడటానికే చాలా మంది ప్రేక్షకులు సినిమాకు వస్తారు. మిగిలిన ఎలిమెంట్స్ బోనస్ లాంటివే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆరేంజ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. దానికి తోడు గత ఏడాది సలార్ తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈసినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి ఈసినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనిపిస్తుంది.

నాగ్ అశ్విన్
ఇప్పటివరకూ నాగ్ అశ్విన్ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ప్రామిసింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నాగ్ అశ్విన్ ఫస్ట సినిమాతోనే హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత ఏకంగా మహానటి సావిత్రి బయోపిక్ ను తెరకెక్కించి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. దీంతో నాగ్ అశ్విన్ నుండి సినిమా వస్తుంది అంటే చూడొచ్చు అనే అభిప్రాయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కల్కి 2898 ఏడీ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈసినిమా కూడా ఖచ్చింతగా మంచి విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కథ
ఈ సినిమాను ఇంత హైప్ రావడానికి గల కారణం ముఖ్యంగా కథ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ గా ఈసినిమాను తీసుకొస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈసినిమా కథ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా తెలియచేశారు మేకర్స్. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుందని అన్నారు. దీనిలో భాగంగానే కలియుగం, కల్కి అవతారం ఇంకా కాశీ, కాంప్లెక్స్, శంబాలా అంటూ వీరు సృష్టించిన మూడు ప్రపంచాలు ఎలా ఉంటాయి.. సిల్వర్ స్క్రీన్ పై ఆ విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

స్టార్ కాస్టింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తో పాటు ఇంకా.. దిషా పటాని, శోభన, అన్నా బెన్ కీలక పలు పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వద్థామ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది కమల్ హాసన్ పాత్ర గురించి. కమల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే తన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

ప్రొడక్షన్ వాల్యూస్
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్ గురించి ఆలోచించే నిర్మాతలు లేరు ఇప్పుడు. ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలే కానీ ఎన్ని కోట్లు అయినా పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా వైజయంతీ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 500 కోట్లతో ఈసినిమాను నిర్మించారు. వీరు పెట్టిన బడ్జెట్ కు ఫలితం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. మరి ఆ విజువల్ వండర్ ను మరో రెండు రోజుల్లో ఎక్స్ పీరియన్స్ చేయనున్నారు ప్రేక్షకులు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.