వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్

AP Deputy CM Pawan Kalyan To Embrace Varahi Ammavari Deeksha From Tomorrow

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘వారాహి’ అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జూన్ 26 నుండి ఆయన ఈ దీక్షను చేపట్టనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. రేపటినుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఇక వారాహి అమ్మవారి దీక్ష సందర్భంగా, పవన్ కళ్యాణ్ సాత్వికాహారం స్వీకరించనున్నారు. దీనిలో భాగంగా ఈ 11 రోజుల దీక్షా కాలంలో ఆయన కేవలం పాలు, పండ్లు మరియు ద్రవపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఈ దీక్షను పాటించారు. గతేడాది జూన్‌లో వారాహి దేవిని పూజించి వారాహి విజయ యాత్ర చేపట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తొలిసారిగా వారాహి అమ్మవారి దీక్షను స్వీకరించారు. అప్పుడు ఆ యాత్ర విజయవంతం అవడమే కాకుండా ఆయన సంకల్పం కూడా నెరవేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుంది. ఇంకా ఆయన స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయగా 70వేల పైచిలుకు భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన మద్దతు తెలిపిన ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇదంతా వారాహి అమ్మవారి ఆశీస్సుల వల్లే సాధ్యమైందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. దీంతో మరోసారి ఆ అమ్మవారి దీక్షకు పూనుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.