రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడి కి హైప్ మాములుగా లేదు.లిమిటెడ్ ప్రమోషన్స్ చేసినా సినిమాకు ఊహించని హైప్ వచ్చింది.అడ్వాన్స్ బుకింగ్సే అందుకు నిదర్శనం.రిలీజ్ కు ఇంకా మూడు రోజుల సమయం వున్నా ఇప్పటివరకు 50కోట్లకు పైగా అడ్వాన్స్ సేల్స్ అయ్యాయి.దాంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల ఓపెనింగ్స్ ను కొల్లగొట్టనుంది.అదే జరిగితే ప్రభాస్ కు ఇది 5వ 100కోట్ల ఓపెనింగ్ సినిమా కానుంది.బాహుబలి 2,సాహో ,ఆదిపురుష్, సలార్ తో ప్రభాస్ ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.అంతేకాదు 5సార్లు 100కోట్లు ఓపెనింగ్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ కాగా పెట్టిన థియేటర్లు అన్ని సోల్డ్ అవుట్ అవుతున్నాయి.ఎర్లీ మార్నింగ్ షోస్ తోపాటు టికెట్ హైక్స్ కు పర్మిషన్ వచ్చింది.ఆంధ్రాలో రావాల్సివుంది.అలాగే నార్త్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 1000కోట్ల క్లబ్ లో చేరేలానే వుంది.
ఓవరాల్ గా కల్కి ఊహించని అంచనాలతో విడుదలవుతుంది.నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అమితాబ్,కమల్ హాసన్ ,దీపికా పదుకొణె ,దిశా పటాని కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిచాడు.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























