స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 లో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ఈసినిమా కూడా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను ఈమధ్యే ప్రకటించారు మేకర్స్. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జూన్ 25వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























