థీమ్ ఆఫ్ కల్కీ-శోభన అద్భుతమైన నృత్య ప్రదర్శన

theme of kalki 2898 ad song out now

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడి సినిమా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, రెండు ట్రైలర్ లను రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇచ్చారు. థీమ్‌ ఆఫ్‌ కల్కి అనే పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో నటి శోభన పలువురు నృత్యకారులతో యమునా నది ఒడ్డున నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది. మరి శోభన కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. మిరియం అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ప్రపంచాలు, ఆ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.. ఈసినమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ప్రీసేల్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌, పశుపతి,శోభన, మాళవిక పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.